యాచారంలో ఎస్‌ఐని ఢీకొట్టి... బ్యానెట్‌పై అర కిలో మీటరు తీసుకెళ్లారు

యాచారంలో ఎస్‌ఐని ఢీకొట్టి... బ్యానెట్‌పై అర కిలో మీటరు తీసుకెళ్లారు
X

రంగారెడ్డి: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతుండగా ఓ మందుబాబు కారును ఎస్‌ఐ ఆపుతుండగా ఎస్‌ఐపిక దూసుకెళ్లింది. ఎస్‌ఐ బ్యానెట్ పట్టుకొని ఆర కిలో మీటర్ తీసుకెళ్లిన అనంతరం బైక్‌ను ఢీకొట్టిన తరువాత కారు ఆగిపోవడంతో ఎస్‌ఐ దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎస్‌ఐ మధు తన సిబ్బందితో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నాడు. వేగంగా దూసుకొస్తున్న కారును ఎస్‌ఐ ఆపడానికి ప్రయత్నించాడు. అతడిపైకి తీసుకరావడంతో బ్యానెట్ పట్టుకున్నాడు. కారును ఆపాలని కారు డ్రైవర్‌ను హెచ్చరించినప్పటికు కారు అలానే అర కిలో మీటరు పోయిన తరువాత బైక్ ఢీకొట్టాడు. అక్కడి నుంచి కొంచె దూరం వెళ్లిన తరువాత కారు ఆగిపోవడంతో ఎస్‌ఐ బ్యానెట్ పైనుంచి పక్కకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. కారులో ఉన్నవారు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి కారు డ్రైవర్ శ్రీకర్‌గా గుర్తించారు. వెంటనే అతడికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చేయగా మద్యం తాగినట్టు తేలింది. కారులో అతడి స్నేహితులు నితిన్ ఉన్నట్టు గుర్తించారు.

Tags

Next Story