రాంగ్ కాల్ ఎంత పని చేసింది....

రంగారెడ్డి: రాంగ్‌కాల్‌తో పరిచయం ప్రేమగా మారడంతో సహజీవనానికి దారితీసింది. ప్రియుడు మద్యానికి బానిస కావడంతో ప్రశ్నించినందుకు ప్రియురాలిని అతడు గొంతు నులిమి చంపేశాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిలా ఆదిభట్ల పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... ప్రకాశం జిల్లా పెట్లూరుకు చెందిన కల్యాణి(37) తన భర్త, పిల్లలతో కలిసి ఉంటుంది. వైజాగ్‌కు చెందిన దాసరి నరసింహమూర్తి అనే వ్యక్తి కల్యాణికి రాంగ్‌కాల్ చేయడంతో పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరు మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త, పిల్లలను వదిలేసి సంవత్సరం నుంచి నరసింహమూర్తితో కలిసి కల్యాణి రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్లలో నివాసం ఉంటున్నారు. నరసింహమూర్తి మద్యానికి బానిసగా మారడంతో గత కొన్ని రోజుల నుంచి ఇద్దరు మధ్య గొడవలు జరగుతున్నాయి. గత ఆదివారం ఫుల్‌గా మద్యం సేవించి ఇంటికి రావడంతో ప్రియుడిని ప్రియురాలిన్ని ప్రశ్నించింది. దీంతో ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. కోపంతో నైలాన్ తాడు తీసుకొని భార్య గొంతునులిమి చంపేశాడు. అనంతరం నైలుతో తాడుతో ఉరేసి ఆత్మహత్య చేసుకుందని నమ్మించేందుకు ప్రయత్నించాడు. మృతురాలి ఫోన్ నుంచి ఆమె భర్తకు తప్పుడు సమాచారం ఇచ్చి అక్కడి నుంచి పారిపోయాడు. రెండు రోజుల తరువాత గది నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి సాంకేతిక ఆధారాలతో నాదర్‌గుల్‌లో నరసింహమూర్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Tags
-
Home
-
Menu
