భారీగా అక్రమాస్తులు.. రంగారెడ్డి జిల్లా ఎడి శ్రీనివాస్ అరెస్టు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా భూ సర్వే అండ్ భూ సంస్కరణల రికార్డు అసిస్టెంట్ డైరెక్టర్(ఎడి) శ్రీనివాస్ అరెస్టు అయ్యాడు. శ్రీనివాస్‌కు సంబంధించి ఎసిబి అధికారులు భారీగా ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో శ్రీనివాసులు పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. గురువారం ఉదయం రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఎడి శ్రీనివాస్ నివాసంలో ఎసిబి అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో సోదాలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాలో ఆరు చోట్ల సోదాలు చేసిన అధికారులు.. దాదాపుగా 100 కోట్ల అక్రమాస్తులు సంపాదించినట్లు గుర్తించారు. అలాగే, మై హోం భూజాలో ఒక ఫ్లాట్, నారాయణపేటలో రైస్ మిల్, కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూమి, అనంతపూర్‌లో 11 ఎకరాలు, మహబూబ్‌నగర్‌లో 4 ప్లాట్లు, నారాయణపేటలో మరో 3 ప్లాట్లు ఉన్నట్లు గుర్తించిన ఎసిబి అధికారులు.. సోదాల్లో విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
-
Home
-
Menu
