మైసా విడుదల అప్పుడే..

నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన కెరీర్‌లో ప్రతిష్టాత్మక పాన్- ఇండియా యాక్షన్ డ్రామా ‘మైసా’లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో గోండ్ గిరిజన మహిళ పాత్ర పోషిస్తున్న రష్మిక , ఆ పాత్రలో ఒదిగిపొవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిలిమ్స్ నిర్మిస్తున్న ’మైసా’ ఆకట్టుకునే ఫస్ట్ గ్లింప్స్‌తో ఇప్పటికే ఆసక్తిని రేకెత్తించింది. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 27న ‘మైసా’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. పోస్టర్‌లో రష్మిక ఒక పెద్ద ఈటె పట్టుకుని నిలబడి ఉండగా, ఆమె ముఖంపై యుద్ధ గాయాలు కనిపిస్తాయి. ఆమె వెనుక భారీ జనసమూహం, మండుతున్న పరిసరాలు ఇంటెన్స్‌గా ఉన్నాయి. ఈ పోస్టర్ బలమైన పీరియడ్- యాక్షన్ లుక్ ఇస్తుంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘మైసా’ కొత్త బెంచ్‌మార్క్‌లను సృష్టించేలా
హై-ఆక్టేన్ స్టంట్ కొరియోగ్రఫీతో రూపొందుతోంది. ఫిమేల్ లీడ్ సినిమాలకే కాకుండా భారతీయ యాక్షన్ జానర్‌ని కొత్త స్థాయికి తీసుకెళ్లేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల సెట్స్‌లో ఓ హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా గాయపడిన రష్మిక మందన్న.. పాత్ర కోసం తన అంకితభావం, పట్టుదలను చూపించారు. కోలుకున్న తర్వాత త్వరలోనే ఆమె తిరిగి షూటింగ్‌లో పాల్గొని చివరి దశ షూటింగ్‌ను పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం ఇంకా 12 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో ఈశ్వరి రావు, గురు సోమసుందరం, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘మైసా’ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
-
Home
-
Menu
