‘ఫంకీ’ సినిమా నుంచి అదిరిపోయే పాట.. సింగర్ ఎవరంటే..

X
‘మాస్ కా దాస్’ విశ్వక్‌సేన్ హీరోగా.. జాతిరత్నాలు ఫేమ్ కెవి అనుదీప్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ఫంకీ’. కయాదు లోహర్ ఈ సినిమాలో హీరోయిన్. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ అన్ని ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్‌ని విడుదల చేశారు. ‘రట్టాటటావ్’ అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు. ఈ పాటని రామ్ మిర్యాల పాడగా.. దేవ్ పవార్ లిరిక్స్ అందించారు. భీమ్స్ సంగీతం సమకూర్చారు. ఇక ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ కామెడి ఎంటర్‌టైనర్ ఫిబ్రవరి 13న విడుదల అయ్యేందుకు సిద్ధమవుతోంది.
Next Story
-
Home
-
Menu
