హైదరాబాద్=ముంబై జాతీయ రహదారిపై రెడీమిక్స్ ట్రక్ బోల్తా

హైదరాబాద్=ముంబై జాతీయ రహదారిపై రెడీమిక్స్ ట్రక్ బోల్తా
X

సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు పాత టోల్‌గేట్ వద్ద కాంక్రీట్ రెడీమిక్స్ లారీ శుక్రవారం బోల్తా పడింది. మండల పరిధిలోని పార్టీ గ్రామం నుండి లింగంపల్లి వైపు వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటనలో డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. రెడీమిక్స్ వాహనం బోల్తా కొట్టడంతో హైదరాబాద్=ముంబై జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. నిలిచిపోయిన వాహనాలను క్లియర్ చేయడానికి పోలీసులు నానాఅవస్థలు పడి ఎట్టకేలకు ట్రాఫిక్‌ను నియంత్రించారు.

Tags

Next Story