భారీ బ్యాటరీతో రెడ్‌మి 15సి 5జి ఫోన్

X
షియోమీ ఇండియా రెడ్‌మి 15సి 5జిను విడుదల చేసింది. ఈ మొబైల్ ఫీచర్లు చూస్తే, 17.53 సెం.మీ. భారీ డిస్‌ప్లే, స్లిమ్ 3డి క్వాడ్ కర్వ్ డిజైన్, 50ఎంపి ఎఐ కెమెరా, 6000 ఎంఎహెచ్ బ్యాటరీ, 33డబ్లు టర్బో ఛార్జింగ్ వంటివి ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 16జిబి వరకు ర్యామ్, 1టిబి స్టోరేజ్, హైపర్ ఓఎస్2తో వస్తుంది. ఇది మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. షియోమీ సిఎంఒ అనుజ్ శర్మ మాట్లాడుతూ, ఈ ఫోన్ రోజువారీ వినియోగదారుల అవసరాల కోసం ప్రత్యేకంగా రూపొందించామని తెలిపారు. ఫోన్ ధరలు రూ.12,499 నుంచి ప్రారంభమవుతాయి.
Next Story
-
Home
-
Menu
