వైద్య విద్యా విధానంలో సంస్కరణలు అవసరమేనా?

Reforms needed in medical education system
X

Reforms needed in medical education system

మన భారత దేశంలో వైద్య విద్యను వైద్య ప్రమాణాలను పరిరక్షించేకే ఇంతకు మునుపు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ ఉండేది. అది మనదేశంలో వైద్య విద్యార్థుల స్థితిగతులను వారి చదువును, పేషంట్లకు లభించే ట్రీట్మెంట్ గురించి ప్రత్యేక శ్రద్ధ చూపించేది. అప్పుడు కూడా మనదేశంలో వైద్య విద్య చదివినా కానీ ఏదైనా విదేశాలకు వెళ్ళాలి అని అంటే అక్కడ సమానమైన పరీక్ష పాస్ అయితేనే మనవల్ని వాళ్ళు దేశాలల్లోకి అనుమతించేవారు ఎందుకంటే మన విద్య పై వారికి నమ్మకం అంతంత మాత్రమే...

తరువాత కొత్త కొత్త మెడికల్ కళాశాలలో ప్రైవేట్ రంగంలో ప్రవేశపెట్టి వాటిలో ఘోస్ట్ ఫ్యాకల్టీ, ఉత్తుత్త పేషెంట్స్ ను తనిఖీలప్పుడు అక్కడ అడ్మిషన్స్ చేసి తనిఖీలు జరిగిన వెంటనే అక్కడ ఎటువంటి ప్రమాణాలు లేకపోవడం అనేది మనము ఒక 15 ఏళ్ల కింద తరచూ వార్తలలో చూసేవాళ్ళము. అయినా కానీ ఇబ్బడిముబ్బడిగా మెడికల్ కళాశాలకు పర్మిషన్లు ఇచ్చి మనకు దాదాపుగా 85 వేల ఎంబిబిఎస్ సీట్లు మన భారతదేశంలో ఉన్నాయి. ఆ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పూర్తిగా అవినీతి ఊబిలో కూరుక పోవడం వలన దానిని సంస్కరించేకి నేషనల్ మెడికల్ కమిషన్ అని ఒక కొత్త దానిని తీసుకొచ్చారు. ఇందులో డాక్టరు, కొందరు నామినీలను ఆ కమిషన్ లో సభ్యులుగా చేర్చారు..

కానీ ఇది కొత్త సీసాలో పాత మందులాగా తయారయ్యింది. ఇప్పుడు కేవలం మెడికల్ సీట్లను పెంచడమే తమ పనిగా పెట్టుకుంది. ఆ కాలంలో నూరు సీట్లకు అడ్మిషన్లు ఇస్తే అటువంటి కళాశాలలకు 250 సీట్ల వరకు పర్మిషన్లు ఇస్తూ ఉంది. ఆ ప్రైవేట్ కళాశాలలో దానికి తగ్గట్లు ఫ్యాకల్టీ కానీ వసతులు కాని ఉండవు. ఇబ్బడిముబ్బడిగా పెరిగిన ఎంబిబిఎస్ సీట్లు, పీజీ సీట్ల వలన వారిపైన అధ్యాపకుల దృష్టి ఉండదు. 250 మంది ఉన్న క్లాసులో ఏదో మొక్కుబడిగా పాఠం చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. వారికి ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది చాలా తక్కువగా ఉంది. పర్యవేక్షణ అంత మందికి చేయడం కూడా కష్టమే? అందుకే చాలామంది క్లాసులకు కూడా గైరుహాజరు అవుతూ ఉంటారు.

క్లినికల్ మెటీరియల్ ప్రభుత్వ ఆసుపత్రులలో ఎక్కువగా ఉన్నా కానీ ప్రైవేట్ ఆసుపత్రులలో క్లినికల్ మెటీరియల్ అనగా రకరకాల పేషెంట్స్ రావడం రకరకాల వ్యాధులను చూడడం చాలా తక్కువగా ఉంటుంది. ఆపరేషన్లు చేసే సర్జరీ లాంటి బ్రాంచీలలో పీజీ సీట్లు ఎక్కువ కావడం వలన వాళ్లకు వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా పేషెంట్స్ వైపు నుంచి ప్రెజర్స్ కన్జ్యూమర్స్ పోరం నుంచి వచ్చేసమస్యల వలన వాళ్లతో ఇండిపెండెంట్ గా ఆపరేషన్లు చేపించాలంటే అధ్యాపకులకు చాలా కత్తితో కూడిన సాములగా ఉంటుంది.

దీనికి తోడు కొత్తగా మిక్సోపతి అని హోమియోపతి ఆయుర్వేదం డాక్టర్లకు కూడా ఎంబిబిఎస్ లో ఉండే ఔషధ శాస్త్రాన్ని ప్రవేశపెట్టి వాళ్లను కూడా అలోపతి డాక్టర్లుగా పరిగణించే కి ఎన్ఎంసి పావులు కదుపుతూ ఉంది.

ఆల్ ఇండియా కోట వలన భారతదేశంలో ఎక్కడైనా కానీ వైద్య విద్యను అభ్యసించేకి పిజి విద్యను అభ్యసించేకి విద్యార్థులకు అవకాశం రావడం వలన ఆ ప్రదేశంలో ఉండే పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోయి ఆపరేషన్లు నేర్చుకోవడం కూడా విద్యార్థులకు కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా క్లిష్టమైన వైద్య విద్యను అభ్యసించే సమయంలో ఒత్తిడిని ఎదుర్కో లేకపోవడం, విద్యార్థులు ఫెయిల్ అయితే విక్టిమ్ కార్డు ప్లే చేయడం వలన ఇప్పుడు ఎక్కువమందిని ఫెయిల్ అంటూ చేయడం అనేది అసలు ఉండదు. అందరిని ప్రాక్టికల్స్ లో పాస్ చేస్తూ ఉంటారు ఎందుకంటే మనకెందుకు వచ్చిన తలకాయ నొప్పి అని అధ్యాపకులు భావిస్తారు. నిజంగా వైద్య విద్య సంస్కరణలు అవసరమే.. సీట్లు పెంచడమే కాకుండా క్వాలిటీ వైద్య విద్య పై దృష్టి పెట్టడం అవసరమే. మీరేమంటారు...

డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్

గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు

ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు

Tags

Next Story