ఆ ముగ్గురితో భారత్ ట్రేడ్ డీల్‌కు బ్రేక్..

ఆ ముగ్గురితో భారత్ ట్రేడ్ డీల్‌కు బ్రేక్
ట్రంప్‌పై రిపబ్లికన్ సెనెటర్ మండిపాటు
వాషింగ్టన్ : భారత్ అమెరికా ట్రేడ్ డీల్‌కు వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో, ఉపాధ్యక్షులు వాన్స్, ప్రెసిడెంట్ ట్రంప్ అడ్డుపడుతున్నారని రిపబ్లిక్ సెనెటర్ టెడ్ క్రూజ్ విమర్శించారు.అధికార పార్టీ సభ్యుడే ఈ దాడికి దిగారు. పార్టీ డోనర్స్‌తో జరిగిన సమావేశంలో ఈ సెనెటర్ ప్రత్యేకించి ట్రేడ్ డీల్ విషయం ప్రస్తావించినట్లు అమెరికా మీడియా తెలిపింది. అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం అత్యవసరం. అయితే దీనిని ముందుకు సాగకుండా, నాన్చడం వెనుక ప్రముఖుల పాత్ర ఉందని ఈ రిపబ్లికన్ ఎంపి మండిపడ్డారు. అంతర్గత సమావేశంలో ప్రస్తావిత అంశాల ఆడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. టెక్సాస్ సెనెటర్ అయిన క్రూజ్ 2028 ప్రెసిడెంట్ ఎన్నికలపై కన్నేసి ఉంచారు. ట్రంప్ టారీఫ్‌లతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. చివరికి ఇది ఆయన అభిశంసనకు దారితీస్తుందని కూడా హెచ్చరించినట్లు వెల్లడైంది. సెనెటర్ల నుంచి ట్రంప్‌పై కీలక విషయాల్లో ఒత్తిడి వస్తోంది. అయితే ఆయన తప్పుడు మాటలకు తలొగ్గుతున్నారు తప్పితే మంచి విషయాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. అమెరికాలో ట్రంప్ నిర్ణయాలతో ఇకపై భారీగా ధరలు పెరుగుతాయి. పరిస్థితి తలకిందులు అవుతుందని ఆయన హెచ్చరించారు.
...............................
-
Home
-
Menu
