ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం: ఇద్దరు పిల్లలు మృతి.... రేవంత్ రెడ్డి విచారం

ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం: ఇద్దరు పిల్లలు మృతి.... రేవంత్ రెడ్డి విచారం
X

నిజామాబాద్: ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రి ఎస్‌ఎన్‌సియు వార్డులో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను రేవంత్ ఆదేశించారు. ఘటనకు దారితీసిన కారణాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ఆసుపత్రుల్లో భద్రతా చర్యలను పటిష్టం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆదిలాబాద్ లోని రిమ్స్‌లో ఎసి పేలడంతో సోమవారం ఒకరు మృతి చెందగా ఇవాళ మరొకరు చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.


Tags

Next Story