ఎసిబి వలకు చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

ఎసిబి వలకు చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్
X

తన పట్టా భూమి రీసర్వే కోసం మహిళ నుంచి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రాహుల్ రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి డిఎస్పీ గట్ల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఘటన బీర్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా బీర్పూర్ అనుబంధ గ్రామమైన సిరిపూర్‌ కు చెందిన ఒంటెల మణెమ్మ తన 12 గుంటల భూమిని రీసర్వే చేయాలని తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంది.

భూమిని రీసర్వే చేయాలంటే రూ.50 వేలు ఇవ్వాలని ఆర్‌ఐ డిమాండ్ చేశాడు. రూ.40 వేలు ఇస్తానని మణెమ్మ ఒప్పందం కుదుర్చుకుంది. డబ్బు డిమాండ్ చేయడాన్ని జీర్ణించుకోలేక ఆమె ఎసిబి అధికారులను ఆశ్రయించింది. దీంతో ఎసిబి అధికారులు గురువారం తహసీల్దార్ కార్యాలయం పరిసరాల్లో మాటు వేశారు. మణెమ్మ రూ.30 వేలు ఆర్‌ఐకి ఇస్తుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Tags

Next Story