325 సర్వే నంబర్ భూములపై ఆరా

కెసిఆర్ ఫామ్ హౌస్ కు సంబంధించి అసెంబ్లీలో జరిగిన చర్చ నేపథ్యంలో ఎర్రవల్లి పరిధిలోని 325 లవణ పట్టా సర్వే నంబర్ పై విచారణ జరిపేందుకు మర్కూక్ మండల తహసీల్దార్ సరిత బుధవారం తన సిబ్బందితో కలిసి నేరుగా ఫీల్డ్ కు వెళ్లి విచారణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రకళ,గవర్నమెంట్ జిల్లా సర్వేర్ అనిల్ కూడా పాల్గొన్నారు. మండల తహసీల్దార్ ఫీల్డ్ కు వచ్చారన్న సమాచారం తెలుసుకున్న సదరు సర్వే నంబర్ పరిధిలో లవణ పట్టా కలిగిన రైతులు, స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. ఈ సందర్భంగా అక్కడి రైతులు, దళితులు మాట్లాడుతూ ఇప్పటివరకు కేసీఆర్ మమ్మల్ని ఏ ఒక్కరినీ ఇబ్బంది పెట్టలేదని, అదనంగా మాకు మేలు చేస్తూ సబ్సిడీలో డ్రిప్పులు ఇచ్చి సాగునీటిని అందించారు అని కెసిఆర్ ను పొగుడుతూ ప్రశంసించారు. 325 సర్వే నంబర్ లో మొత్తం 380 ఎకరాల భూమి ఉందనీ ఇందులో
దాదాపు 200 కుటుంబాలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నమని 325 సర్వే నంబర్ లో ఎవరికీ చెప్పకుండా సర్వే అధికారులు రెవెన్యూ సిబ్బంది సర్వేకు ఎలా వస్తారని ప్రశ్నించారు. 325 సర్వే నంబర్లలో కేసీఆర్ పేరు మీద గానీ ఆయన కబ్జా చేసింది గానీ ఇంచు కూడా లేదు అని రైతులు వెల్లడించారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడింది తప్పు అని దళిత రైతులు స్పష్టం చేశారు. తమ అనుభవంలో ఉన్న భూముల వివరాలను తహసీల్దార్ కు వివరించారు. ఎంపీడీవో చంద్రకళ మర్కూక్ తహసీల్దార్ కార్యాలయంలో పాత రెవెన్యూ రికార్డులను తనిఖీ చేశారు. సర్వే నంబర్ 325 యొక్క హద్దులు, పాత తహసీల్ రికార్డులు, లవణ పట్టా ఎవరి పేరు మీద మంజూరు అయ్యింది అనే అంశాలపై మరోసారి పాత రికార్డులతో సరిపోల్చి చూసి పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని వెల్లడించారు.
-
Home
-
Menu
