గల్ఫ్‌ లో రోడ్డు ప్రమాదం.. వైకుంఠాపూర్ వాసి మృతి

గల్ఫ్‌ లో రోడ్డు ప్రమాదం.. వైకుంఠాపూర్ వాసి మృతి
X

బతుకు దెరువు కోసం గల్ఫ్‌కు వెళ్లిన కామారెడ్డి జిల్లా సారంగాపూర్ మండల వైకుంఠాపూర్ గ్రామ వాసి రోడ్డు ప్రమాదంలో సోమవారం మృతి చెందాడు. ఆయన మృతితో వైకుంఠాపూర్‌లో విషాదచాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన లగ్గం జగదీశ్ పొట్టకూటి కోసం గల్ఫ్ వెళ్లాడు. అకస్మాత్తుగా అనుకొని రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందగా కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురులు ఉన్నారు. ప్రభుత్వం, రాజకీయ నాయకులు జగదీశ్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

Tags

Next Story