సిద్దిపేటలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి!

సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. హుస్నాబాద్ మండలం పందిళ్ల సమీపంలో కారు, ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో తండ్రి, కుమార్తె ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదంలో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన పైడిపల్లి శ్రీకాంత్, ఆయన కుమార్తె అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనలో శ్రీకాంత్ భార్య తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కారు, ట్రాక్టర్ ఢీకొనడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించే చర్యలు చేపట్టారు. కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో కొండాపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తండ్రి, కుమార్తె మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
-
Home
-
Menu
