ఖరీదైన పనిమనిషి

X
robot cleaning house floor
డిబోట్ అనే ఈ రోబోట్ పనిమనిషి ఇంటిని శుభ్రపరిచే శక్తి వంతమైన మహిళల నేస్తం. సెట్ చేసిన సమయం ప్రకారం మొదటి దుమ్ము ధూళి శుభ్రంగా చేస్తుంది. తరువాత అది తన ఛాంబర్ కెళ్ళి దుమ్ము వదిలేసి మరల తడిగుడ్డ పెట్టి తుడుస్తుంది. ఒకటికి రెండుసార్లు నీట్ గా శుభ్రం చేసిన తరువాత తన స్ధానంలోకి వెళ్లి ఛార్జింగ్ చేసుకుంటుంది. దీని ధర. రూ. 55000 అమెజాన్ లో ఉంది. దుమ్ము ఓ బ్యాగ్ లోకి వెళ్లి పోతుంది. అది మనం పడేయాలి. శుద్ధి చేసి మరలా వాడుకోవచ్చు. మాది గ్రానైట్ ఫ్లోరింగ్ కావున శుభ్రంగా తుడుస్తోంది. మార్బుల్ కూడా బాగానే ఉంటుంది. మన సెల్ ఫోన్ ద్వారా దీనిని మనం ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు.
డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్
గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు
ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు
Tags
Next Story
-
Home
-
Menu
