ఆసియా క్రీడల్లో శుభారంభం.. భారత్ కు రెండు పతకాలు

X
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో భారత్ శుభారంభం చేసింది. గురువారం జరిగిన పోటీల్లో భారత్ రెండు పతకాలను సాధించింది. పురుషుల డబుల్ స్కల్స్ ఈవెంట్‌లో భారత రోవర్లు సత్నాం సింగ్, సల్మాన్ ఖాన్ కాంస్య పతకాన్ని సాధించారు. ఇక, స్టార్ వుషు క్రీడాకారిణి రోషిబినా దేవి.. మహిళల 60 కేజీల సాండా ఈవెంట్‌లో రజత పతకం సాధించి దేశానికి మరో పతకాన్ని అందించింది. దీంతో రోషిబినా దేవి వుషులో వరుసగా రెండో రజతం సాధించింది. 2022 హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో కూడా రోషిబినా రజత పతకాన్ని కైవసం చేసుకుంది.
కాగా, ఎంపిక ట్రయల్స్‌లో యువ క్రీడాకారిణి దివ్యాంశీ చౌదరి చేతిలో రోషిబినా ఓడిపోయినప్పటికీ, ఆ తర్వాత తన ప్రత్యర్థికి గాయం కావడంతో ఆమె జట్టులోకి ఎంపికైంది.
Next Story
-
Home
-
Menu
