నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది
X

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 1215 స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్టులు (ఆర్‌ఆర్‌బిఎస్) నోటిఫికేషన్ విడుదల చేశాయి. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అక్టోబర్ 27 నుంచి నవంబరు 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 2026 నవంబరు 25 నాటికి నిర్దేశిత విద్యార్హత కలిగి ఉండాలి.

2027 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయసు 20 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీ (నాన్ క్రీమీలేయర్ ) అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి సడలింపు ఉంటుంది. మాజీ సైనికులు, ఇతర అర్హత కలిగిన వర్గాలకు నిబంధనల మేరకు సడలింపులు వర్తిస్తాయి. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించే ముందు అర్హత నిబంధనలు,ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానాన్ని పూర్తిగా పరిశీలించాలని రైల్వే మంత్రిత్వశాఖ సూచించింది. రైల్వేరిక్రూట్ మెంట్ బోర్డుల ( ఆర్‌ఆర్‌బి) అధికారిక వెబ్‌సైట్లలో , ఆన్‌లైన్ దరఖాస్తు పోర్టల్‌లో అందుబాటులో ఉన్న లింక్‌ల ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొంది.

Tags

Next Story