గుడ్ న్యూస్..6,557 రైల్వే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌!

గుడ్ న్యూస్..6,557 రైల్వే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌!
X

రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం చేయాలని చూస్తున్నవారికి గుడ్ న్యూస్! రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) పదవ తరగతి, గ్రాడ్యుయేట్ అభ్యర్థుల కోసం 6,557 రైల్వే టెక్నీషియన్ పోస్టులను ప్రకటిస్తూ అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. RRB టెక్నీషియన్ గ్రేడ్-I, టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టుల కోసం దరఖాస్తుల స్వీకరణ ఈరోజు అంటే జూన్ 30న ప్రారంభమైంది. ఆసక్తిగల, అర్హతగల అభ్యర్థులు జూలై 29, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.


వయసు

టెక్నీషియన్ గ్రేడ్-I పోస్టులకు వయోపరిమితి 18 నుండి 33 సంవత్సరాలు ఉండాలి. అలాగే, టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు 18 నుండి 30 సంవత్సరాలు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు కూడా అందుబాటులో ఉంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో సడలింపు లభిస్తుంది.


విద్య అర్హత

దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ కూడా కలిగి ఉండాలి.


పరీక్షా విధానం

అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలో జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్ విభాగాల నుండి 100 మల్టిపుల్-ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నా సమాధానానికి మార్కులలో మూడింట ఒక వంతు నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది.


జీతం

టెక్నీషియన్ గ్రేడ్-I పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.29,200, టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.19,900 జీతం లభిస్తుంది.


పోస్టుల వివరాలు

ఈ నియామక ప్రక్రియ కింద మొత్తం 6,557 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వీరిలో టెక్నీషియన్ గ్రేడ్-I పోస్టులకు 323, టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు 6,234 అభ్యర్థులను కేటాయిస్తారు.


దరఖాస్తు చేసుకోవడానికి ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: జూన్ 30, 2026

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 29, 2026

ఫీజు చెల్లింపులకు చివరి తేదీ: జూలై 31, 2026

అప్లికేషన్ సవరణ తేదీలు: ఆగస్టు 1 నుండి 10

Tags

Next Story