ఇంటి మ్యూటేషన్‌కు రూ.15 వేల లంచం.. ఎసిబికి చిక్కిన పంచాయతీ సిబ్బంది!

సిద్దిపేట: ఇంటి మ్యూటేషన్ కోసం లంచం డిమాండ్ చేసిన గ్రామపంచాయతీ సిబ్బంది ఎసిబి అధికారులకు పట్టుబడిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇంటి మ్యూటేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు గ్రామపంచాయతీ కార్యదర్శి అరుణ, కారోబార్ సంతోష్ కలిసి రూ.15 వేల లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.
లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు ఈ విషయాన్ని ఎసిబి అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఎసిబి అధికారులు.. లంచం మొత్తాన్ని తీసుకుంటున్న సమయంలో సిబ్బందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. రూ.15 వేల లంచం స్వీకరిస్తుండగా ఎసిబి అధికారులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, లంచం డిమాండ్ వెనుక ఉన్న పరిస్థితులపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ సేవలకు లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.
Tags
-
Home
-
Menu
