బాన్సువాడ లో కారు అద్దాలు పగలగొట్టి..రూ.8 లక్షలు చోరీ

బాన్సువాడ లో కారు అద్దాలు పగలగొట్టి..రూ.8 లక్షలు చోరీ
X

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో మంగళవారం ఒక వ్యక్తి కారులో ఉంచిన రూ. 8 లక్షల నగదు చోరీకి గురైంది.మాధవరావు అనే వ్యక్తి నగదును కారులో ఉంచి బాన్సువాడలోని రిలయన్స్ మార్కెట్ వద్ద కారును పార్క్ చేసి లోపలికి వెళ్లాడు. బాధితుడు షాపింగ్‌కు వెళ్లిన తక్కువ సమయంలోనే దొంగలు సినీ ఫక్కీలో కారు అద్దాలు పగులగొట్టి లోపల ఉన్న నగదు సంచిని ఎత్తుకెళ్లారు. షాపింగ్ ముగించుకుని తిరిగి వచ్చిన మాధవరావు కారు అద్దం పగిలి ఉండటం చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా..పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. సిసిటివి పుటేజిలో ఓ వ్యక్తి కారు అద్దాలు పగలగొట్టి నగదు బ్యాగ్ ను ఎత్తుకెళ్లడం రికార్డు అయ్యింది. మాధవరావు ఎస్‌బిఐ (SBI) బ్యాంకు నుండి రూ. 8 లక్షలు విత్ డ్రా చేశాడు. దొంగలు బ్యాంకు నుండి బాధితుడిని వెంబడించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం వెతకటం ప్రారంభించారు.

Tags

Next Story