సిద్ధిపేటలో..లారీని ఢీకొన్న ఆర్టిసి బస్సు

X
హైదరాబాద్: సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఔటర్ రింగ్ రోడ్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ డిపోకు చెందిన ఆర్టిసి బస్సు అదుపు తప్పి హైదరాబాద్ వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొంది. డ్రైవర్ కు గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని..సహాయక చర్యలు చేపట్టారు. రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story
-
Home
-
Menu
