ఆర్టిసి బస్సు, బైకును వేగంగా ఢీ కొట్టిన లారీ.. బైకర్ మృతి

ఆర్టిసి బస్సు, బైకును వేగంగా ఢీ కొట్టిన లారీ.. బైకర్ మృతి
X

హైదరాబాద్: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై అతి వేగంతో ఆర్టిసి బస్సు, లారీ బైకును ఢీకొంది. ఒకరు మృతి చెందాడు. 9 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. మృతుడు ఎల్లమ్మరంగాపురం వంగూరు మండలానికి చెందిన రాజు అనే వ్యక్తి హైదరాబాద్ లో హెచ్ డి ఎఫ్ సి లో బ్యాంకులో పని చేస్తున్నాడు. ద్విచక్రవాహనం రోడ్డపై నడుపుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లారీ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Next Story