వనపర్తిలో ఆర్‌టిసి బస్సు బోల్తా

వనపర్తిలో ఆర్‌టిసి బస్సు బోల్తా
X

వనపర్తి: ఆర్‌టిసి బస్సు బోల్తాపడిన సంఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు మంత్రాలయం నుంచి వనపర్తికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బైక్‌ను తప్పించబోయి బస్సు బోల్తా పడినట్టు సమాచారం. ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Next Story