ఆర్టీసీ బస్సు బోల్తా...

X
ఆర్టీసీ బస్సు బోల్తా పడి 19 మందికి గాయాలైన సంఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుధవారం రాత్రి హైదరాబాద్ నుండి అనంతపూర్ కి బయలుదేరింది. ఉండవెల్లి మండలం ఇటిక్యాల పాడు స్టేజి సమీపంలో 44 నెంబర్ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున 4 గంటలకు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సమయంలో బస్సులో 19 మంది ప్రయాణికులు ఉన్నారు. స్నేహలత, అరుణ, జయ రాములు, శివ లకు తీవ్ర గాయాలు కాగా మరో 15 మంది కి స్వల్ప గాయాలయ్యాయి. గాయాలైన వారిని 108 అంబులెన్స్ లో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story
-
Home
-
Menu
