లిఫ్ట్ ఇచ్చి... కదులుతున్న కారులో గ్యాంగ్ రేప్

రాంఛీ: 25 ఏళ్ల మహిళకు కారులో లిఫ్ట్ ఇచ్చి వాహనంలో ఆమెపై ఒకరు అత్యాచారం చేశారు. ఈ సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉద్దమ్ సింగ్ నగర్ జిల్లా రుద్రపూర్‌లోని క్యాంప్ ఏరియాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జనవరి 25న ఓ మహిళ తన ఇంటి నుంచి పని చేసే పంత్ నగర్‌కు నడుచుకుంటూ వెళ్తోంది. రాహుల్ దాస్, పర్కాన్ అనే యువకులు మహిళకు కారులో లిఫ్ట్ ఇచ్చారు. కొంచెం దూరం తీసుకెళ్లిన తరువాత కారులోనే ఆమెపై ఇద్దరు సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను నిర్మానుష్య ప్రదేశంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉండడంతో అతడిని కూడా అరెస్ట్ చేశారు. పది రోజుల క్రితం ఉత్తరాఖండ్ రాష్ట్రం పౌరి గర్హల్ జిల్లాలో ఓ యూనివర్సిటీ విద్యార్థినిపై స్నేహితుడు అత్యాచారం చేసిన విషయం తెలిసిందే.
Tags
-
Home
-
Menu
