రోజురోజుకూ వైసిపి నిజస్వరూపం బయటపడుతోంది: చంద్రబాబు

X
అమరావతి: ప్రజల సాధికారత, సేవే కేంద్రంగా తమ పాలన ఉందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. వైసిపి పాలనలో అరాచకత్వం, చట్టాల ఉల్లంఘనలు మైలురాయిగా నిలిచాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2024 నుంచి రాష్ట్రంలో చట్ట పాలనను పునరుద్ధించామని తెలియజేశారు. రోజురోజుకూ వైసిపి నిజస్వరూపం బయటపడుతోందని, వైసిపి నేతలు మరింత అసహనం, అసంతృప్తికి లోనవుతున్నారని, ఒకప్పుడు ధ్వంసం చేసిన వ్యవస్థను పునర్నిర్మాణం చేస్తుంటే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. చట్టమే అత్యున్నతం అనేది కూటమి పాలనలో సుస్పష్టం చేసిందని సిఎం పేర్కొన్నారు. తాము నెలకొల్పిన శాంతిభద్రతలను కాపాడటం తమ బాధ్యత అని.. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఉపేక్షించేది లేదని, చట్టపాలనకు విరుద్ధంగా వ్యవహరించే ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని చంద్రబాబు హెచ్చరించారు.
Next Story
-
Home
-
Menu
