92కు పడిపోయిన రూపాయి

92కు పడిపోయిన రూపాయి
X

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం కారణంగా భారత కరెన్సీ రూపాయి విలువ భారీగా క్షీణించింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ జీవితకాల కనిష్ట స్థాయి 92.30 పడిపోయింది. తొలిసారిగా 92 మార్క్‌కు పడిపోయింది. గ్లోబల్ మార్కెట్లలో పెరుగుతున్న ఆందోళనలు రూపాయి పతనానికి కారణమయ్యాయి. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం, ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 85 డాలర్లకు చేరడం వల్ల భారత రూపాయి అమెరికా డాలర్‌తో పోలిస్తే రికార్డు కనిష్ట స్థాయి 92 కు పడిపోయింది. గతంలో జనవరిలో కనిష్ట స్థాయి 91.98 గా ఉంది. ఈ సంవత్సరం రూపాయి విలువ ఇప్పటికే 2 శాతానికి పైగా క్షీణించింది.

యుద్ధ పరిస్థితులు కొనసాగితే రూపాయి ఒత్తిడిలోనే ఉంటుందని నిపుణులు తెలిపారు. విదేశీ పెట్టుబడిదారులు డాలర్ వైపు మొగ్గుచూపడంతో రూపాయి బలహీనపడింది. చమురు ధరల పెరుగుదల ద్రవ్యోల్బణ భయాలను పెంచింది. గత నెలలో అమెరికా, -భారత్ వాణిజ్య ఒప్పందం తర్వాత వచ్చిన ఊరట తాత్కాలికంగా ముగిసింది. విదేశాలకు చదువు, ప్రయాణ ఖర్చులు పెరగవచ్చు. దిగుమతి ఎలక్ట్రానిక్ వస్తువులు ఖరీదయ్యే అవకాశం ఉంది. చమురు ధరలు పెరిగితే పెట్రోలు, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశముంది. మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ఆర్‌బిఐ (భారతీ రిజర్వ్ బ్యాంక్) జోక్యం చేసుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Tags

Next Story