93కి చేరువలో రూపాయి

93కి చేరువలో రూపాయి
X

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో సోమవారం భారత రూపాయి 10 పైసలు పడిపోయి డాలర్‌కు 92.40 వద్ద ముగిసింది. రూపాయి చరిత్రలో అత్యంత కనిష్ట స్థాయి ఇదే. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి 92.44 వద్ద ప్రారంభమై రోజులో 92.47 వరకు పడిపోయింది. గత సెషన్‌లో 92.30 వద్ద ముగిసింది. ముడి చమురు ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడులు ఉపసంహరించుకోవడజం వల్ల ఒత్తిడి పెరిగిందని నిపుణులు తెలిపారు. దేశీయ షేర్ మార్కెట్లు కోలుకోవడం వల్ల మరింత పతనం కొంతవరకు తగ్గిందని ట్రేడర్లు తెలిపారు.

Tags

Next Story