తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?

X
తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కల్పించేందుకు సుమారు 4 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. ఇక నిన్న మొత్తం 56,695 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు 24,786 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. మరోవైపు శ్రీవారి హుండీ ద్వారా రూ.4.28 కోట్ల ఆదాయం సమకూరినట్లు టిటిడి గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Tags
Next Story
-
Home
-
Menu
