కొండను ఢీకొట్టిన విమానం: 29 మంది మృతి

X
Russian military plane crashes
మాస్కో: రష్యా దేశంలో నల్ల సముద్రంలోని క్రిమియా ద్వీపకల్పంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. పెనున్‌సులాలో కొండచరియను విమానం ఢీకొట్టడంతో 29 మంది చనిపోయారు. మృతి చెందిన వారిలో 23 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారని విమానయాన అధికారులు వెల్లడించారు. 2014లో యుక్రెయిన్ దేశంలో నుంచి క్రిమియా ద్వీపాన్ని రష్యా స్వాధీనం చేసుకుంది. ఎఎన్-26కి చెందిన సైనిక విమానంగా గుర్తించారు. ఈ ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
Next Story
-
Home
-
Menu
