శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే

Sabarimala ayyappa swamy
పోటెత్తిన అయ్యప్ప భక్తులు
స్వామి దర్శనానికి 16 గంటల సమయం
సోమవారం1.25 లక్షల మంది,
మంగళవారం మధ్యాహ్నం వరకు 1.97 లక్షల మంది భక్తులకు అయ్యప్ప దర్శనం
మనతెలంగాణ/హైదరాబాద్: శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సాయంత్రం గుడి తలుపులు తెరుచుకోగా వేలాదిగా అయ్యప్ప భక్తులు శబరిమల చేరుకుంటున్నారు. దీంతో స్వామి దర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతోంది. కిలోమీటర్ల మేర భక్తుల పడిగాపులు కాస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన అయ్యప్ప భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సోమవారం రికార్డు స్థాయిలో 1.25 లక్షల మంది భక్తులు ఆ హరిహరపుత్రుడిని దర్శించుకోగా, మంగళవారం మధ్యాహ్నం వరకు 1.97 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఆన్‌లైన్‌లో (www.sabarimalaonline.org)లో రోజుకు 70 వేల మందికి ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు స్లాట్ బుకింగ్ కోసం అవకాశం కల్పించింది. అదనంగా మరో 20వేల మందికి స్పాట్ బుకింగ్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేసింది. అయితే, సోమవారం ఏకంగా 37 వేల మంది, మంగళవారం 32 వేల మంది భక్తులు స్పాట్ బుకింగ్ చేసుకున్నారని, అందుకే రద్దీ విపరీతంగా పెరిగిందని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టిడిబి) అధికారులు పేర్కొన్నారు. పంపా బేస్‌ల్లో రద్దీని బట్టి ఆన్‌లైన్ బుకింగ్ లేని భక్తులను నీలకల్‌లోనే పోలీసులు నిలిపివేస్తున్నారు. నీలక్కల్లో భక్తులకు వసతి సదుపాయాలను పోలీసులు కల్పిస్తున్నారు.
-
Home
-
Menu
