‘ఇది నా బ్యాడ్‌లక్’ అన్న మోగ్లీ డైరెక్టర్.. సాయి దుర్గా తేజ్ సపోర్ట్

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ-2’ చిత్రం డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండేది. కానీ, అనుకోని అడ్డంకుల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఇప్పుడు అదే చిన్న సినిమాలను చిక్కుల్లోపడేసింది. ‘అఖండ-2’ కొత్త విడుదల తేదీ ప్రకటించకపోవడంతో చిన్న సినిమాల రిలీజ్‌పై సందిగ్ధత నెలకొంది. ఒకవేళ ‘అఖండ-2’ చిత్రం డిసెంబర్ 12న విడుదలైతే.. ఆ రోజు విడుదల కావాల్సిన చిన్న సినిమాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. అందులో సందీప్ రాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘మోగ్లీ’ సినిమా కూడా ఒకటి. సందీప్ తెరకెక్కించిన తొలి చిత్రం ‘కలర్ ఫోటో’ కూడా లాక్‌డౌన్ కారణంగా ఒటిటిలో విడుదలైంది. ఇప్పుడు మోగ్లీ చిత్రం కూడా వాయిదా పడే పరిస్థితులు రావడంతో సందీప్ భావోద్వేగంతో పోస్ట్ పెట్టాడు.
‘‘అసలు నా రెండు సినిమాలకు తాను కాకుండా వేరే వాళ్లు దర్శకుడిగా అర్హులేమో. అంతా సవ్యంగా జరుగుతుంది అనుకుంటే విడుదల విషయంలో దురదృష్టం ఎదురవడం. నేను నాదే బ్యాడ్‌లక్. అనుకుంటా. ‘డైరెక్టెడ్ బై సందీప్ రాజ్’ అని వెండితెరపై చూడాలి అనుకున్న కల రోజు రోజుకీ కష్టతరమవుతోంది. సిల్వర్‌స్క్రీన్ నన్ను ద్వేషిస్తుందేమో. రోషన్, సరోజ్, సాక్షి, హర్ష, డివొపి మారుతి, మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ.. ఇలా అంకిత భఆవంతో ఎన్న ఎంతో మంది కష్టంతో ‘మోగ్లీ’ రూపొందింది. వారి కోసమైనా ఈ సినిమా విషయంలో మంచి జరగాలని ఆశిస్తున్నా’’ అని సందీప్ రాసుకొచ్చాడు.
ఈ నేపథ్యంలో ప్రముఖ హీరో సాయి దుర్గా తేజ్ సందీప్‌కి భరోసా ఇచ్చాడు. ‘‘సందీప్.. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఊహించని విధంగా దక్కుతుంది. ధైర్యంగా ఉండండి. మీ విషయంలో మీరు గర్వపడండి. చివరకు సినిమా గెలుస్తుంది’’ అని సాయి దుర్గా తేజ్ పేర్కొన్నాడు. ‘‘డియర్ సందీప్.. జాతీయ అవార్డు చిత్రం ‘కలర్ ఫోటో’లో మీరు ఒక భాగం. ఈ అడ్డంకులన్నీ తాత్కాలికం. దిగులు పడొద్దు. మీ కష్టాన్ని ప్రేక్షకులు గుర్తిస్తారు. మద్దతు ఇస్తారు. ఆల్ ది బెస్ట్’’ అని నిర్మాత ఎస్‌కెఎన్ అండగా నిలిచాడు.
-
Home
-
Menu
