ఛాంపియన్: మనసుని హత్తుకునేలా ‘సల్లంగుండాలే...’ సాంగ్

ఛాంపియన్: మనసుని హత్తుకునేలా ‘సల్లంగుండాలే...’ సాంగ్
X

ఫ్రెష్, ఆకట్టుకునే కథలను అందించడంలో స్వప్న సినిమాస్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. వారి అప్ కమింగ్ వెంచర్ ‘ఛాంపియన్’. జీ స్టూడియోస్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలిమ్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, అర్చన కీలక పాత్రల్లో నటించారు. ఇప్పుడు మేకర్స్ సెకండ్ సింగిల్ సల్లంగుండాలే రిలీజ్ చేశారు. వివాహానికి ముందు వధువు నిశ్శబ్దంగా కూర్చుని, తన ఇల్లు, గ్రామాన్ని విడిచిపెట్టాలనే ఆలోచనతో బాధపడుతోంది. తండ్రి ఆమెను ఓదార్చడానికి వస్తాడు. అక్కడే పాట ప్రారంభమవుతుంది. ఆమె సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలని అతను ఆశీర్వదించినప్పుడు కుటుంబం మొత్తం, గ్రామం వివాహ వేడుకల ప్రారంభాన్ని ఈ సాంగ్ అద్భుతంగా చూపించింది.

ఈ పాటతో మిక్కీ జె మేయర్ మ్యాజిక్ సృష్టించాడు. సల్లంగుండాలే భావోద్వేగం, వేడుక రెండింటినీ కలిగి ఉన్న మరొక అద్భుతమైన పాట. చంద్రబోస్ సాహిత్యం, వివాహంలో జరిగే ప్రతి ఆచారం, భావోద్వేగాన్ని అందంగా చూపించింది. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, అర్చన వధువు తల్లిదండ్రులుగా ఆకట్టుకోగా, రోషన్, అనశ్వర రాజన్ జోడి డ్యాన్స్ తో పాటకు ఉత్సాహాన్ని తెస్తారు. సల్లంగుండాలే సాంగ్ ప్రతి వివాహ వేడుకలో మ్రోగబోతుంది. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.



Tags

Next Story