మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎ11+

మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎ11+
X


న్యూఢిల్లీ : సామ్‌సంగ్ ఇండియా తాజాగా గెలాక్సీ ట్యాబ్ ఎ11+ ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ ట్యాబ్ ధర రూ.19,999 నుంచి ప్రారంభమవుతుంది. 11 అంగుళాల డిస్‌ప్లే, మెటల్ డిజైన్, డాల్బీ అట్మాస్ క్వాడ్ స్పీకర్లు, 8 ఎంపి బ్యాక్ కెమెరా, 5 ఎంపి ఫ్రంట్ కెమెరాతో పనితీరు, వినోదానికి అనువుగా దీనిని రూపొందించారు. గూగుల్ జెమినీ, సర్కిల్ టు సెర్చ్, సామ్‌సంగ్ నోట్స్‌లో సాల్వ్ మ్యాథ్ వంటి ఎఐ ఫీచర్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రతిరోజూ జీవనాన్ని మెరుగుపరచే ఆవిష్కరణలు సంస్థ లక్ష్యం అని సామ్‌సంగ్ ఇండియా ఎంఎక్స్ డైరెక్టర్ సాగ్నిక్ సేన్ అన్నారు.

Tags

Next Story