అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ముజామిల్ అరెస్ట్

Arrest
X

చిత్తూరు: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ముజామిల్‌ను ఎపి ఎర్ర చందనం అక్రమ రవాణా నిరోధక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ‘‘ముజామిల్‌పై అనేక కేసులు ఉన్నాయి. అతడిపై 87 శాతం కేసుల్లో శిక్షలు ఖరారు అయ్యాయి. అప్పటి నుంచే ముజామిల్ తప్పించుకు తిరుగుతున్నాడు. చైనా జైమెన్ టాంగాంగ్ ఫాంగ్ ట్రేడ్ కంపెనీతో ముజామిల్‌కు సంబంధాలు ఉన్నాయి’’ అని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎర్ర చందనం అక్రమ రవాణా నిరోధక దళాన్ని ఎపి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ అభినందించారు.

Tags

Next Story