జనవరిలో భర్త మరణం.. పిల్లలకు విషమిచ్చి భార్య ఆత్మహత్య

X
సంగారెడ్డి: కంది మండలం జూలకల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య చేసుకుంది. చిన్నారులు చనిపోయిన తర్వాత ఉరేసుకుని తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు తల్లి మమత (28), మణికంఠ(5), ప్రళయ(4)గా గుర్తించారు. జనవరి నెలలో రోడ్డు ప్రమాదంలో మమత భర్త చనిపోయాడు. భర్త చనిపోయాడనే మనస్తాపంతో పిల్లలతో సహా మమత ఆత్మహత్య చేసుకుంది. ఈ ముగ్గురి మృతితో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Tags
Next Story
-
Home
-
Menu
