ర్యాగింగ్ రగడ

ర్యాగింగ్ రగడ
X

సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం సృష్టించిం ది. మొదటి సంవత్సరం విద్యార్థి ప్రతి చంద్రను సీనియర్లు ర్యాగింగ్ చేశారు. విషయాన్ని అతని సోదరుడికి తెలపడంతో, ర్యాగింగ్ ఎందుకు చేశారంటూ బాధిత విద్యార్థి సోదరుడు సీనియర్లను నిలదీశాడు. తమనే నిలదీస్తావా అంటూ శాంతినగర్‌లో బాధితుడి ఇంటిపై 50మంది సెకండ్ ఇయ ర్ విద్యార్థులు బుధవారం సాయంత్రం దాడికి దిగారు. తమ వారిని ఇద్దరిని బంధించారంటూ సీనియర్ విద్యార్థులు ప్రశ్నించారు. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. బాధితుని తండ్రిపై దాడికి యత్నించారు. దీంతో వారు ఎదురు తిరిగారు. ఈ క్రమంలో ఇద్దరు సీనియర్ విద్యార్థులకు గాయాలైనట్లు తెలిసింది. ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలవని పరిస్థితి ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకొని గొడవలు జరగకుండా చూశారు.

Tags

Next Story