కుటుంబకలహాలతో దంపతుల ఆత్మహత్య

పటాన్‌చెరు: కుటుంబ కలహాలు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. భార్యాభర్త వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఐలాపూర్ చిన్న తండాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్నూలు జిల్లాకు చెందిన లాల్ శేఖర్(32), తన భార్య అనుషతో కలిసి రెండేళ్లుగా ఐలాపూర్ చిన్న తండాలో దోబీ పని చేసుకుంటూ ఉండేవారు. ఇద్దరి మధ్య తరుచూ గొడవలు వచ్చేవి.
ఈ ఆదివారం కూడా భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో అనుష సమీపంలోని తల్లిగారింటికి వెళ్లిపోయింది. సోమవారం తన పుట్టింట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త శేఖర్ తలుపు పగలగొట్టి వెళ్లి చూడగా.. అప్పటికే ఆమె ప్రాణాలు విడిచింది. దీంతో తనకు ఏం జరుగుతుందోనని ఆందోళన చెంది తానుండే ఇంటికి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శేఖర్, అనుషల మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
-
Home
-
Menu
