చీమల ఫోబియా.. వివాహిత ఆత్మహత్య..

చీమల ఫోబియా.. వివాహిత ఆత్మహత్య..
X

సంగారెడ్డి: ఎన్ని కష్టాలు ఉన్నా.. వాటిని ఎదురుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తుంటారు కొందరు. మరికొందరు చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో పెట్టి చూసి ప్రాణాలు తీసుకుంటారు. ఇలాంటి దురదృష్టకరమైన ఘటనే సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో చోటు చేసుకుంది. చీమలంటే భయపడే ఓ మహిళ.. చీమలతో బతకలేకపోతున్నానంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. నవ్య కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న శ్రీకాంత్, మనీషా దంపతులకు ఓ కుమార్తె ఉంది.

మనీషా చీమల ఫోబియాతో బాధపడుతుండటంతో భర్త ఆస్పత్రిలో చూపించారు. ఈ నెల 4న ఉద్యోగ నిమిత్తం భర్త విధులకు వెళ్లి వచ్చేసరికి తలుపులు గడియ పెట్టి ఉన్నాయి. ఎంతకీ తలుపులు తీయకపోవడంతో స్థానికుల సాయంతో తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ తన భార్య చీరతో ఉరి వేసుకొని విగతజీవిగా శ్రీకాంత్‌కు కనిపించింది. అదే గదిలో నోట్‌బుక్‌లో సూసైడ్ నోట్ కూడా దొరికింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Tags

Next Story