సంజుకు కష్ట కాలం.. టీ20 వరల్డ్ కప్ తుది జట్టులో చోటు దక్కేనా?

సంజుకు కష్ట కాలం.. టీ20 వరల్డ్ కప్ తుది జట్టులో చోటు దక్కేనా?
X

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో స్టార్ ఆటగాడు సంజు శాంసన్ పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరిచాడు. ఐదు మ్యాచుల్లో ఆడే ఛాన్స్ దొరికిన ఒక్క మ్యాచ్‌లో కూడా కనీసం 20 పరుగుల మార్క్‌ను అందుకోలేక పోయాడు. వరుస అవకాశాలు లభించినా వాటిని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ఘోర వైఫల్యం చవిచూశాడు.

ఇలాంటి స్థితిలో త్వరలో జరిగే టి20 ప్రపంచకప్ తుది జట్టులో అతనికి ఛాన్స్ దొరుకుతుందా అంటే కష్టమేనని సమాధానం వస్తోంది. అందివచ్చిన అవకాశాలు చేజార్చుకున్న సంజు జట్టులో స్థానాన్ని ప్రశ్నార్థకంగా మార్చుకున్నాడు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ గాయం నుంచి కోలుకోవడంతో సంజు కష్టాలు మరింత పెరిగాయి. సంజు కంటే తిలక్ వర్మకే తుది జట్టులో ఆడించే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే సంజు బెంచ్‌కే పరిమితం కాక తప్పదు.

Tags

Next Story