జగిత్యాలలో సర్పంచ్ కారుకు అడ్డుగా వచ్చాడని చితక్కొట్టారు... వీడియో వైరల్

X
జగిత్యాల: సర్పంచ్ కారుకు అడ్డుగా వచ్చాడనే కారణంతో ఓ వ్యక్తిపై దాడి చేసిన సంఘటన జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్ గ్రామంలో జరిగింది. సర్పంచ్ భర్త గట్టు గంగారం, ఆయన కుటుంబీకులు కలిసి దమ్మ తిరుపతి అనే వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశారు. కారుకు అడ్డు వచ్చాడనే కారణంతో వారు తిరుపతిపై సర్పంచ్ భర్త, ఆయన అనుచరులు దాడి చేశారు. స్పృహ కోల్పోయిన అతడిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Next Story
-
Home
-
Menu
