ఓటర్లకు బిందెలు పంచుతూ అడ్డంగా దొరికిన సర్పంచ్ అభ్యర్థి

కామారెడ్డి జిల్లా, తాడ్వాయి మండలం, కన్కల్ గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు బిందెలు పంచుతూ దొరికిన సర్పంచ్ అభ్యర్థి పోలీసులకు పట్టుబడ్డాడు. ఎస్‌ఐ నరేష్ తెలిపిన ప్రకారం వివరాల్లోకి వెళ్తే.. గురువారం మధ్యాహ్నం గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికల్లో ప్రచారం చేస్తూ సర్పంచ్ అభ్యర్థికి సంబంధించిన మద్దతుదారులు ఓటర్లను ప్రభావితం చేయడానికి బిందెలు పంచుతున్నారు. సరైన సమాచారంతో ఎన్నికల స్పెషల్ టీం సభ్యులు దాడి చేసి 41 బిందెలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ..పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఓటరులను ప్రభావితం చేసే విధంగా మద్యం, డబ్బు, ఇతర వస్తువులను పంపిణీ చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని, చట్టపరంగా వాళ్ళు శిక్షార్హులు అవుతారని హెచ్చరించారు. ఓటర్లు స్వచ్ఛందంగా నాయకులను ఎన్నుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు తలగొద్దని, ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు.
-
Home
-
Menu
