సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతానని సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య

సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతానని సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య
X

కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన ఓ సర్పంచ్ అభ్యర్థి సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతానేమోనని భయంతో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పిప్పడ్ పల్లి గ్రామంలో సోమవారం నాడు చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పిప్పడ్ పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి చాల్కి రాజు (36) అనే వ్యక్తి సర్పంచ్ గా పోటీ చేసి బరిలో నిలిచారు. అయితే ఆయన అప్పటికే అయ్యప్ప మాలాధారణ వేసి మండలంలోని శంషాద్దీన్ పూర్ గ్రామ శివారులో గల అయ్యప్ప సన్నిధానంలో తోటి అయ్యప్ప స్వాములతో ఉంటున్నాడు. కాగా రోజు మాదిరిగానే ఆదివారం రాత్రి తోటి స్వాములతో నిద్రించాడు. సోమవారం తెల్లవారు జాము నాలుగు గంటల ప్రాంతంలో నిద్ర లేచి తోటి స్వాములతో కలిసి కాలకృత్యాలు చేయడానికి బయటకు వెళ్లాడు.

అయితే బయటకు వెళ్లినఅయ్యప్ప స్వాములు తిరిగి సన్నిధానానికి వచ్చారు.. కాని రాజుస్వామి మాత్రం రాలేదు. దీంతో అయ్యప్ప స్వాములు చుట్టు పక్కల వెతికినా.. రాజు స్వామి ఆచూకి లభించలేదు. దీంతో చేసేదేమి లేక శంషాద్దీన్ పూర్ గ్రామస్తులకు సమాచారం అందించడంతో వెంటనే కొంత మంది గ్రామస్తులు అయ్యప్ప స్వామి సన్నిధానానికి చేరుకొని సమీప ప్రాంతంతో వెతికడంతో ఓ చెట్టుకు టావల్ తోని ఉరి వేసుకొని కనిపించాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు, రాయికోడ్ పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలాన్ని సంగారెడ్డి జిల్లా ఏఎస్పీ రఘునందన్ రావు, జహీరాబాద్ డీఎస్పీ సైదా, రూరల్ సీఐ హన్మంత్ లు పరిశీలించి జరిగిన విషయాన్ని అయ్యప్ప స్వాములను అడిగి తెలుసుకున్నారు. మృతుని కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని భార్య శ్వేత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రాయికోడ్ ఎస్‌ఐ చైతన్య కిరిణ్ తెలిపారు.

Tags

Next Story