సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత హామీలు నెరవేర్చకపోతే పదవికి రాజీనామా చేస్తా..బాండ్ పేపర్ రిసిచ్చిన అభ్యర్థి

జుక్కల్ నియోజకవర్గం పిట్లం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి సర్పంచ్ అభ్యర్థి నవాబ్ సుదర్శన్ గౌడ్ రాజీ నామా బాండ్ పేపర్‌ను అందజేశారు. ఈ సందర్బంగా నవాబ్ సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ- తన పదవీకాలం సగం అంటే 2.5 ఏళ్లు పూర్తయ్యేలోగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైతే, ఎలాంటి పదవి మోహం లేకుండా తాను స్వయంగా సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తానని బాండ్ పేపర్ రాసి ప్రకటించారు. తమ మాట, తమ హామీల పరిరక్షణ పట్ల ప్రజల ముందే ప్రమాణం చేస్తున్నానని స్పష్టం చేశారు. గ్రామ అభివృద్ధి కోసం పారదర్శక పాలన, మౌలిక వసతుల మెరుగుదల, పంచాయతీ పనుల్లో ప్రజా భాగస్వామ్యం పెంపు వంటి అంశాలను ప్రధాన ప్రాధాన్యాలుగా తీసుకొని ముందుకు సాగనున్నట్లు తెలిపారు. గ్రామ సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని నమ్మకమిస్తున్నట్లు నవాబ్ సుదర్శన్ గౌడ్ తెలిపారు. పిట్లం గ్రామాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలపడం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
-
Home
-
Menu
