మానవతా విలువలు బోధించిన మహనీయుడు సత్యసాయిబాబా: చంద్రబాబు

మానవతా విలువలు బోధించిన మహనీయుడు సత్యసాయిబాబా: చంద్రబాబు
X

మన తెలంగాణ – అమరావతి: ‘అందరినీ ప్రేమించు.. అందరినీ సేవించు’ అనే గొప్ప దివ్య సందేశాన్ని ప్రపంచానికి అందించిన మహనీయుడు శ్రీ సత్యసాయిబాబా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. సత్యసాయిబాబా జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ, మానవాళికి ప్రేమ, సేవ, మానవతా విలువలను బోధించిన ఆయన జీవితం అందరికీ ఆదర్శమని చంద్రబాబు పేర్కొన్నారు.

నిస్వార్థ సేవే నిజమైన ఆధ్యాత్మికత అని సత్యసాయిబాబా తన జీవితంతో చాటిచెప్పారని, విద్య, వైద్యం, తాగునీటి రంగాల్లో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సత్యసాయిబాబా చూపిన సేవామార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని, సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తూ మానవతా విలువలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాల ద్వారా బాబా సందేశాన్ని ఆచరణలో పెట్టాలని చంద్రబాబు నాయుడు సూచించారు.

Tags

Next Story