'సర్' కొనసాగాల్సిందే

సర్ కొనసాగాల్సిందే
X

అడ్డంకులు కల్పించొద్దని పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు హెచ్చరిక

గడువు మరో వారం రోజులు పొడిగింపు

మమత ప్రస్తావించిన అడ్డంకులు తొలగిస్తామని అభయం

అన్ని రాష్ట్రాలు దీన్ని గమనించాలని సూచన

అవసరమైతేనే జోక్యం చేసుకుంటామని వివరణ

న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియను పూర్తి చేయడంలో ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని సుప్రీంకోర్టు సోమవారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అయితే, ఈ ప్రక్రియలో నిజమైన ఇబ్బందులను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా కోర్టు హామీ ఇచ్చింది. బెంగాల్ సర్ లో పరిశీలన లేదా దరఖాస్తులను పూర్తి చేయడానికి, డేటాను ఖరారు చేయడానికి కోర్టు గడువును ఒక వారం పాటు పొడిగించింది.

ఫశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లాయర్ గా హాజరై, కమ్యునికేషన్ కోసం వాట్సాప్ వినియోగానికి స్వస్తిచెప్పి, మైక్రో అబ్జర్వర్ లను తొలగించడం వంటి మార్పులు సర్ ప్రక్రియలో చేయాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్య వచ్చింది. మైక్రో అబ్జర్వర్లకు బదులుగా 8,505 గ్రూప్ బి అధికారులను నియమించాలని కూడా మమతా బెనర్జీ కోరారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోర్టు వైఖరిని స్పష్టం చేస్తూ, పశ్చిమ బెంగాల్ కోరిన అడ్డంకులను తాము తొలగిస్తామని, కానీ సర్ పూర్తి చేయడంలో ఎలాంటి అడ్డంకులు సృష్టించబోమని, ఈ విషయం సుస్పష్టం అని పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ తో పాటు జస్టిస్ జోయ్ మల్య బాగ్చి, ఎన్ వి అంజరియాలతో కూడిన ధర్మాసనం సర్ తలపెట్టిన కసరత్తు షెడ్యూల్ ప్రకారం కొనసాగాలని నొక్కి చెప్పింది.

ఎన్నికల కమిషన్ తరుపున హాజరైన సీనియర్ న్యాయవాది డిఎస్ నాయుడు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారుల (ఇఆర్ ఓ) నియామకం పై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు.

ఇఆర్ ఓ లు క్వాసీ - జుడీషియల్ విధులను నిర్వహిస్తారని, అందువల్ల తగినంత న్యాయనిర్ణయ అనుభవం ఉండాలని ఆయన పేర్కొన్నారు.ఎన్నికల కమిషన్ 300 మంది గ్రూప్ బి అధికారులను కోరినప్పటికీ, అలాంటి అనుభవం ఉన్న 64 మంది అధికారులనే కేటాయించారని న్యాయవాది పేర్కొన్నారు. మిగిలిన వారిని వేతన సమానత్వం ప్రాతిపదికన నియమించినట్లు తెలిపారు. మైక్రో అబ్జర్వర్ల ద్వారా పెద్దఎత్తున ఓటర్ల పేర్లు తలగింపు సాధ్యం కాదని సీనియర్ న్యాయవాది స్యామ్ దివాన్ వాదించారు. కాగా, ఈ ఆందోళనలకు సమాధానమిస్తూ ఇఆర్ ఓలు, అసిస్టెంట్ ఇఆర్ ఓలకు సహాయం చేసేందుకే మైక్రో అబ్డర్వర్లను ఏర్పాటు చేశారని, తుదినిర్ణయం మాత్రం ఇఆర్ ఓలదే నని,

ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. వెరిఫికేషన్ కసరత్తు ఫలితాన్ని కోర్టు పరిశీలిస్తుందని సిజేఐ వెల్లడించారు. వెరిఫికేషన్ తర్వాత, ఈ నోటీసులలో ఎన్ని కొట్టివేశారో చూసి, 80 శాతం కేసులు కొట్టవేయబడితే, మీ వాదన సబబే, చిన్న తేడాలు ఉంటే తప్పు అని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

తాత్కాలిక ఆదేశాలు జారీ చేసిన సిజెఐ

బెంగాల్ లో సర్ ప్రక్రియను క్రమబద్దీకరించడానికి, పారదర్శకంగా ఉండేలా చూసేందుకు సిజేఐ కొన్ని మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. 8,555 మంది గ్రూప్ బి అధికారుల జాబితాను సాయంత్రం 5 గంటలలోపు జిల్లా ఎన్నికల అధికారులకు సమర్పించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఉన్న ఇఆర్‌ఓలు, ఏఇఆర్‌ఓలను భర్తి చేయడానికి, అధికారుల సేవలను ఉపయోగించుకోవడానికి ఎన్నికల సంఘానికి కోర్టు అధికారం ఇచ్చింది.

Tags

Next Story