జగిత్యాలలో స్కూళ్లో బాలిక(4)పై కరెస్పాండెంట్ అత్యాచారం

హైదరాబాద్: నాలుగేళ్ల చిన్నారిపై స్కూల్ కరెస్పాండెంట్ అత్యాచారం చేసిన సంఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... చల్లా శ్రీనివాస్ అనే వ్యక్తి ధర్మపురిలో ఓ ప్రైవేట్ స్కూల్‌కు కరస్పాండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. మూడు రోజుల క్రితం నాలుగేళ్ల చిన్నారిని తన రూమ్‌లోకి తీసుకొని బాలికపై అత్యాచారం చేశాడు. చిన్నారికి రక్తశ్రావం కావడంతో తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసి చల్ల శ్రీనివాస్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. స్కూల్ పర్మిషన్ కూడా రద్దు చేశామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఆ స్కూల్‌కు సంబంధించిన పిల్లలను స్థానిక ప్రభుత్వ స్కూల్‌లో చదవాలని సూచించారు. పిల్లలను స్కూల్ కు పంపాలంటే భయం వేస్తుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఎప్పుడు ఎక్కడ నుంచి ఏ మృగం కాటువేస్తుందో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
-
Home
-
Menu
