పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు

తొలి, మూడో విడత
పోలింగ్ జరిగే గ్రామాలలో సెలవులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల కారణంగా పాఠశాలలకు వరుస సెలవులు లభించనున్నాయి. ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పాఠశాలల్లో ఏర్పాటు చేస్తుండటంతో, ప్రభుత్వం పలు దఫాలుగా సెలవులు ప్రకటించింది. దీంతో ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోని విద్యార్థులు, ఉపాధ్యాయులకు సుమారు ఆరు రోజుల పాటు విరామం దొరకనుంది. తొలి విడత పోలింగ్ నిర్వహణ, ఏర్పాట్ల కోసం డిసెంబర్ 10, 11 తేదీల్లో పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రెండో విడత ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 13, 14 తేదీల్లో జరగనుండగా, ఆ రోజులు రెండో శనివారం, ఆదివారం కావడంతో ఆ రెండు రోజులు సాధారణ సెలవులుగానే ఉన్నాయి. మూడో విడత పోలింగ్ సందర్భంగా డిసెంబర్ 16, 17 తేదీల్లో కూడా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. పోలింగ్ సామగ్రిని సిద్ధం చేయడం, ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించడం కోసం అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
-
Home
-
Menu
