సీనియర్ నటుడు రఘునాథ రెడ్డి మృతి

సీనియర్ నటుడు రఘునాథ రెడ్డి మృతి
X

సీనియర్ నటుడు రఘునాథ రెడ్డి గారు శనివారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 72 ఏళ్లు. హైదరాబాద్‌లోని కుషాయిగూడలో ఉన్న తన నివాసంలో ఆయన గుండెపోటుతో మరణించాడు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొద్ది నెలల క్రితమే ఆయన కుమారుడు కూడా మరణించడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. రఘునాథ రెడ్డికి భార్య అన్నపూర్ణ,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.నాటక రంగం నుంచి వచ్చిన ఆయన 1991లో శోభన్ బాబు నటించిన 'సర్పయాగం' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. తన విలక్షణమైన కంచు కంఠంతో, గంభీరమైన మాట తీరుతో సహాయ నటుడిగా, విలన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 370 సినిమాల్లో నటించారు. 'ఓరేయ్ రిక్షా', 'ప్రేమించు పెళ్లాడు', 'చంటి', 'శ్రీరామరాజ్యం' వంటివి ఆయనకు మంచి పేరు తెచ్చిన చిత్రాలు.కేవలం సినిమాలే కాకుండా పలు ప్రజాదరణ పొందిన సీరియల్స్ ద్వారా కూడా ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

Tags

Next Story