తెలంగాణ విశ్వవిద్యాలయంలో మద్యం మత్తులో జూనియర్ పై సీనియర్స్ దాడి

కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో గల తెలంగాణ విశ్వవిద్యాలయం లో సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ కు ఘర్షణ చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం హోలీ సంబరాల్లో భాగంగా జూనియర్స్ వర్సెస్ సీనియర్ విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పర దాడులకు పాల్పడ్డారు. సీనియర్ లు మధ్యం తాగి వచ్చి ఓ జూనియర్ పై దాడికి దిగారు. దీంతో రెండు రోజులుగా కళాశాలలో సీనియర్ వర్సెస్ జూనియర్లుగా విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పర దాడులకు పాల్పడ్డారు. హిస్టరీ విభాగం ఫైనల్ ఇయర్ విద్యార్థి విక్కీ, హిస్టరీ విభాగంకు చెందిన జూనియర్ రాజును వాటర్ జగ్గు తో దాడి చేశారు. దింతో గాయాల పాలైన రాజు ను చికిత్స నిమిత్తం ఆసుపత్రి కి తరలించారు. దీంతో విద్యార్థులు ఆందోళన చేపట్టగా వసతి గృహం వద్దకు చేరుకున్న ఎస్‌ఐ ఆంజనేయులు విద్యార్థులను సముదాయించే ప్రయత్నం చేసిle వినలేదు. ఈ విషయమై దాడికి ప్రయత్నం చేసిన 8 మంది విద్యార్ధులను ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్ తాత్కాలిక సస్పెండ్ చేశారు.
-
Home
-
Menu
